Tuesday, August 13, 2013

                                       శ్రీసాయిపాదం

సాయిరాం
పరమయోగీంద్రులకు పరమపదమందించు.. పరమపావన విష్ణుపాదం
భవబంధ రహితమై బ్రహ్మమై భాసిల్లు పరమ పావన విష్ణు పాదం
పరమపావన పరబ్రహ్మ పాదం…
ఘనభూమి గగనముల కొలిచి చుంబించి బలిదంబం మంచిన వామననిపాదం
దివ్యమౌ, భవ్యమౌ.. దివిజ గంగాజలం  జాలువారిన జగన్నాథ పాదం
గుహుని గుండెల నిండి మైత్రి పండించిన కులమతాతీత రఘుకుల రామపాదం
సాయిసమాధి
దశదిశా దీపమీ పాదం.. దయకు ప్రతిరూపమీ ధర్మపాదం
శరణం శ్రీవిష్ణు పాదం, శరణం శ్రీ రామ పాదం, శరణం శ్రీకృష్ణపాదం
శరణం శ్రీ సాయి పాదం, శరణం శ్రీ సాయి పాదం, శరణం గురుసాయి పాదం
కపట రాక్షస వికట బహుపటాటోప వ్రిహు శకట సువిపాటన సుచనులపటు పాదం
కాళీయు తలలపై తద్దిమి తకదిమ్మి తాండవమ్ముల కృష్ణ పాదం
కంసాది విధ్వంస.. హింసా విభ్రంశ యతువంశ వరరాజ హంస పాదం
మూడు మూర్తుల ముక్తిపాదం.. ముక్కోటి దేవతల మూల పాదం
శరణం శ్రీవిష్ణు పాదం, శరణం శ్రీ రామ పాదం, శరణం శ్రీకృష్ణపాదం
శరణం శ్రీ సాయి పాదం, శరణం శ్రీ సాయి పాదం, శరణం గురుసాయి పాదం

శరణం శ్రీ సాయి పాదం, శరణం శ్రీ సాయి పాదం, శరణం గురుసాయి పాదం

No comments:

Post a Comment